Monday, June 12, 2017

నిను గాక మరి దేనిని నే ప్రేమింప నీయ్యకు

Ninu Gaka Mari Denini
నిను గాక మరి దేనిని నే ప్రేమింప నీయ్యకు
నీ కృపలో నీ దయలో నీ మహిమ సన్నిధిలో
నను నిలుపుమో యేసు
1. నా తలపులకు అందనిది నీ సిలువ ప్రేమా
నీ అరచేతిలో నా జీవితం చెక్కించు కొంటివే
వివరింప తరమ నీ కార్యముల్
ఇహ పరములకు నా ఆధారం నీవై యుండగా
నా యేసువా నా యేసువా
2. రంగుల వలయాల ఆకర్షణలో మురిపించే మెరుపులలో
ఆశనిరాశల కోటలలో నడివీధు ఈలోకంలో
చుక్కాని నీవే నా దరి నీవే నా గమ్యము
నీ రాజ్యమే నీ రాజ్యమే
నా యేసువా నా యేసువా

Saturday, May 27, 2017

మధురమైనది నా యేసు ప్రేమ

మరపురానిది నా తండ్రి ప్రేమ (2)

మరువలేనిది నా యేసుని ప్రేమ (2)

మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ
ప్రేమా… ప్రేమా…

ప్రేమా… నా యేసు ప్రేమా (2)        ||మధురమైనది||
ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని

నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2)

చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2)

నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం       ||ప్రేమా||
పర్వతములు తొలగినా మెట్టలు గతి తప్పినా

ఎగసి పడే అలలతో కడలే గర్జించినా (2)

మరణపు ఛాయలే దరి చేరనీయక (2)

కౌగిట దాచిన నీ ప్రేమ మధురం        ||ప్రేమా||
నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి

మార్గమును చూపి మన్నించితివి (2)

మరణపు ముల్లును విరచిన దేవా (2)

జీవము నొసగిన నీ ప్రేమ మధురం       ||ప్రేమా||