Monday, March 4, 2013

voiceofteluguchristians


1. యేసుతో ఠీవిగాను పోదమా

 యేసుతో ఠీవిగాను పోదమా
   అడ్డుగా వచ్చు వైరి గెల్వను
   యుద్ధ నాదంబుతో పోదమా
1. రారాజు సై న్యమందు చేరను
    ఆరాజు దివ్య సేవ చేయను
    యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా
    యేసుతో ఠీవిగాను వెడలను    "యేసుతో"
2. విశ్వాస కవచమును ధరించుచు
    ఆ రాజు నాజ్ణమధిని నిల్పుచు
    అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై
    యేసుతో ఠీవిగాను పోదము      "యేసుతో"
3. శోధనలు మనల చుట్టి వచ్చినా
    సాతాను అంబులెన్నో తగిలినా
    భయము లేదు మనకిక ప్రభువు చెంత నుందుము
    సాదనబెవరు నీవు నేనెగా     "యేసుతో"
4. ఓయువతి యువకులార చేరుడీ
    శ్రీ యేసు రాజు వార్త చాటుడీ
    లోకమంత ఏకమై యేసు రాజు గొల్వను
    సాదనంబెవరు నీవు నేనెగా

2. జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా


    జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా
    స్తుతి మహిమలు నీకే .....
    నా ఆత్మలో అనుక్షణం
    నా అతిశయము నీవే  - నా ఆనందము నీవే
    నా ఆరాధన నీవే.....    - 2              " జ్యోతి"
1. నా పరలోకపు తండ్రీ - వ్యవసాయకుడా
    నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా
2. నా పరలోకపు తండ్రీ - నా మంచి కుమ్మరి
    నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా
3. నా తండ్రి కుమార,పరిశుద్ధాత్ముడా
    త్రీయేక దేవా - ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద


3.  పాడెద నేనొక నూతన గీతం 

     పాడెద నేనొక నూతన గీతం - పాడెద మనసారా
     యేసయ్యా నీ నామమేగాగ వేరొక నామము లేదాయే -2
1. కలుషితమైన నదియై నేను - కడలియైన నీలో    - 2
   కలిసిపోతినే కలువరి ధారిలో కనబడదే ఇక పాపాలరాశి - 2
2. పోరు తరగని సిగ సెగలన్నియు - అణచి కృపాతిశయము -2
    కొదువైన నానా హృదయములోన పొంగెనే అభిషేకతైలం  - 



  4. హల్లేలూయ స్తుతి మహిమా ఎల్లఫుడు దేవుని కిచ్చెదము


  హల్లేలూయ స్తుతి మహిమా ఎల్లఫుడు దేవుని కిచ్చెదము
    ఆ... హల్లెలూయహల్లెలూయ. హల్లెలూయ   -2    "హల్లేలూయ"
1. అల సై.న్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము   - 2
    అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము  - 2               "హల్లే"
2. ఆకాశము నుండి మన్నాను పంపిన - ఆ దేవుని స్తుతించెదము   - 2
    బండనుండి మధుర జలమును పంపిన - ఆ యెహోవాను స్తుతించెదము  - 2 "హల్లే"
3. పరలోకము నుండి ధరకేతించిన - దేవుని స్తుతించెదము - 2
    నసియించు దానిని వెదకి రక్షించిన -  యేసుని స్తుతించెదము  - 2                  "హల్లే"



5. శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం 


  శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం - భజియించి నే పాడనా స్వామీ - 2
    హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా
1. దానియేలును సింహపు బోనులో - కాపాడినది నీవెకదా  - 2
    జలప్రళయములో నోవాహును గాచిన
    బలవంతుడవు నీవెకదా - నీవెకదా 
    హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా   "శృతి"
2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవెకదా - 2
    పాపులకొరకై  ప్రాణమునిచ్చిన
    కరుణామయుడవు నీవెకదా - నీవెకదా
    హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా   "శృతి" 


6.  నీతో సమమెవరునీలా ప్రేమించేదెవరు ?

  నీతో సమమెవరునీలా ప్రేమించేదెవరు ?

     నీలా క్షమియించెదెవరు యేసయ్యా

     నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరూ?  "2"

1. వెండి బంగారము ధన ధా న్యాలను - ఒక్కపోగేసిన నీతో సరితూగునా “2"
    జీవనదులన్నియూ సర్వసముద్రములు - ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా
    నీలా జాలిగల ప్రేమగల దేవుడేరి - నీవేగా మంచి దేవుడవు   "2"    " నీతో"
2. పలు వేధాలలోమత గ్రందాలలో - పావనేసుకన్న పరిశుద్ధుడెవరు “2"
    పాప పరిహారము సిలువ మరణమొంది - తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు
    నీలా పరిశుద్ద దేవుడెవరున్నారయ్యా - నీవేగా విమోచకుడవు   "2"  "నీతో"
3. నేను వెదకాకున్నా నాకు దొరికితివి - నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి "2"
    నీకు గాయాలుచేసి తరచు రేపితిని - నన్నెంతో సహించి క్షమియించితివి 
    లోక సౌఖ్యాలన్నీ ఒక చోట - కుమ్మరించినా - నీవేగా చాలిన దేవుడవు "2" "నీతో


7. జీవిత యాత్రలో నాదు గురి నీవె


 జీవిత యాత్రలో నాదు గురి నీవెగా - నీకు సాటియెవ్వరు యేసువా
    నీవు నడిచావు కెరటాలపై - నన్ను నడిపించుమో యేసువా   "జీవిత"
1. నన్ను నడిపించు చుక్కాని నీవేకదా
    నన్ను కాపాడు దుర్గంబు నీవేగదా
    నీదు వాక్యంబు సత్యంబుగా - నాకు నిరతంబు జీవంబెగా
    నేను పయనించు మార్గంబెగా - నన్ను నడిపించుమో యేసువా  "జీవిత"
2. నాకు నిరతంబు మధిలోన నీద్యానమే
    నేను  స్వరమెత్తి వినిపింతు నీ గానమే
    నాకు నీవేగా సర్వస్వము - నీదు నామంబె ఆధారము
    నాకు సర్వేశ్వరుడనీవెగా - నిన్ను స్తుతియింతుమో యేసువా  "జీవిత"






Wednesday, February 20, 2013

Nadipinchu Naa Naava ( నడిపించు నా నావ )


Nadipinchu Naa Naava ( నడిపించు నా నావ )

పల్లవి

D                 A        D
నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా
   Bm        G      A       D
నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప          ||నడిపించు||

చరనం 1

  D       Bm      A          G
నా జీవిత తీరమున - నా అపజయ భారమున
  A     G      D     Bm       A   D
నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు
D                  A       D
నాయాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప
   Bm        G      A      D
నా నావలో కాలిడుము - నా సేవ జేకొనుము          ||నడిపించు||

చరనం 2

రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము
రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ          ||నడిపించు||
 
చరనం 3

ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే - ఆవేద నెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నా వలలు           ||నడిపించు||
 
చరనం 4

ప్రభు మార్గము విడచితిని - ప్రార్ధించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని
ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును పొంది
ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట         ||నడిపించు||

చరనం 5

ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకతింతును లోకములో - పరిశుధ్ధుని ప్రేమకథ
పరమాత్మ ప్రోక్షణలో - పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు - పానార్పణము జేతు       ||నడిపించు||

Chorus  

D                           A             D
Nadipinchu Naa Naava - Nadi Sandhramuna Deva
     Bm              G       A              D
Nava Jeevana Margamuna - Naa Janma Thariyimpa       ||Nadipinchu||

Verse 1 

D                   Bm        A               G
Naa Jeevitha Theeramuna - Naa Apajaya Bharamuna
    A        G         D      Bm        A       D
Naligina Naa Hrudayamunu - Nadipinchumu Lothunaku
D                          A               D
Naa Aathma Virabhuya - Naa Deeksha Phaliyimpa
    Bm              G       A           D
Naa Naavalo Kaalidumu - Naa Seva Jekonumu           ||Nadipinchu||

Verse 2 

Rathranthayu Shramapadina - Raaledu Prabhu Jayamu
Rahadarulu Vedhakinanu - Radayenu Pratiphalamu
Rakshinchu Nee Siluva - Ramaneeya Lothulalo
Ratanalanu Vedhukutalo - Rajillu Naa Padava         ||Nadipinchu||

Verse 3

Aathmarpana Cheyakaye - Aashinchiti Nee Chelimi
Ahamunu Preminchuchune - Arasithi  Prabhu Neekalimi
Aasha Nirashaye - Aavedha  Nedhuraye
Aadhyathmika Lemigani - Allade Naa Valalu           ||Nadipinchu||

Verse 4 

Prabhu Maargamu Vidachithini - Prardhinchuta Maanithini
Parbhu Vaakyamu Vadhalithini - Paramardhamu Marachithini
Prapancha Natanalalo - Praveenyamunu Pondhi
Phala Heenudanai Ipudu - Paatinthu Nee Maata        ||Nadipinchu||
 
Verse 5  

Prabhu Yesu Shishyudanai - Prabhu Premalo Paadhukoni
Prakatinchunu Loakamulo - Parishudhuni Premakatha
Paramaathma Prokshanalo - Paripoorna Samarpanatho
Praanambunu Prabhukoraku - Paanarpanamu Jethu       ||Nadipinchu||

Christian Songs


అత్యున్నత సింహాసనముపై
పల్లవి:    అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతుము నిన్నే
ఆహాహా ... హల్లేలూయ  (4X)
ఆహాహా ... హల్లేలూయ  (3X)  ...ఆమెన్
1.        ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం
ఆహాహా
2.        కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణకర్తా స్తోత్రం
ఆహాహా
3.        ఆమేన్ అనువాడా స్తోత్రం - ఆల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం
ఆహాహా
4.        మ్రుత్యుంజయుడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవా త్వరలో రానున్న - మేఘవాహనుడా స్తోత్రం
ఆహాహా

అన్ని నామముల కన్న
పల్లవి:     అన్ని నామముల కన్న పై నామము _ యేసుని  నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)
1.            పాపముల నుండి విడిపించును _ యేసుని  నామము
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)
2.         సాతాను పై అధికార మిచ్చును _ శక్తి గల  యేసు నామము
శత్రు సమూహము పై జయమునిచ్చును _ జయశీలుడైన యేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)
3.         స్తుతి ఘన మహిమలు చెల్లించుచు _ క్రొత్త కీర్తన పాడెధము
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో _ స్తోత్ర గానము చేయుదము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)
అన్ని నామముల కన్న పై నామము _ యేసుని  నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)


ఆలయంలో ప్రవేశించండి
పల్లవి:    ఆలయంలో ప్రవేశించండి అందరూ
స్వాగతం సుస్వాగతం యేసునామంలో
మీ బ్రతుకులో పాపమా కలతలా
మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తిడిచి వేయు రాజు యేసు కోసం
1.        దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
వెదకే వారికంతా కనబడు దీపము
యేసురాజు మాటలే వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధికమధికము
ఆత్మలో దాహము తీరెను రారండి
ఆనందమనందం హల్లెలూయా                                ..ఆలయంలో..
2.        ప్రభు యేసు మాటలే పెదవిలోమాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం మంచి మాటలే
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం నిండెదం కోరేదం పొందెదం
ఆనదంమానదం హల్లెలూయా                                 ..ఆలయంలో..

ఎందుకో నన్నింతగ నీవు
పల్లవి:    ఎందుకో నన్నింతగ నీవు ప్రేమించితివో దేవా 
అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయ యేసయ్యా 
1.        నా పాపము బాప నరరూపి వైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే            .. హల్లెలూయ..
2.        నీ రూపము నాలో నిర్మించి యున్నావు నీ పోలికలోనే నివసించు చున్నావు 
నీవు నన్ను ఎన్ను కొంటివి  నీ కొరకై నీ క్రుపలో                 .. హల్లెలూయ..
3.        నా శ్రమలు సహించి నా ఆశ్రయ మైనావు - నా వ్యధలు భరించి నన్నా దు కొన్నావు 
నన్ను నీలో చూచుకున్నావు నను దాచి యున్నావు         .. హల్లెలూయ..

ఎన్ని తలచినా
పల్లవి:     ఎన్ని తలచినా - ఏది  అడిగినా - జరిగేది నీ చిత్తమే 
ఎన్ని తలచినా - ఏది  అడిగినా - జరిగేది నీ చిత్తమే
 ప్రభువా  జరిగేది నీ చిత్తమే 
నీ వాక్కుకై వేచి యుంటిని నా ప్రార్ధన ఆలకించుమా 
ప్రభువా  -  నా ప్రార్ధన ఆలకించుమా 
1.        నీ తోడు లేక - నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు 
నీ తోడు లేక - నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు 
అడవి పూవులే - నీ ప్రేమ పొందగా - అడవి పూవులే - నీ ప్రేమ పొందగా
నా ప్రార్ధన ఆలకించుమా ప్రభువా  నా ప్రార్ధన ఆలకించుమా  
2.        నా ఇంటి దీపం - నీవే అని తెలిసి - నా హృదయం నీ కొరకు పదిల పరచితి 
నా ఇంటి దీపం - నీవే అని తెలిసి - నా హృదయం నీ కొరకు పదిల పరచితి 
ఆరిపోయిన నా వెలుగు దీపము - ఆరిపోయిన నా వెలుగు దీపము 
వెలిగించుము నీ ప్రేమతో -  ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో
3.        ఆపదలు నన్ను - వెన్నంటియున్న నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి 
ఆపదలు నన్ను - వెన్నంటియున్న నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి 
లోకమంతయు నన్ను విడిచినా - లోకమంతయు నన్ను విడిచినా 
నీ నుండి వేరు చేయవు - ప్రభువా నీ నుండి వేరు చేయవు  
ఎన్ని తలచినా - ఏది  అడిగినా - జరిగేది నీ చిత్తమే
            ప్రభువా  జరిగేది నీ చిత్తమే

ఓరన్న  ఓరన్న
పల్లవి:     ఓరన్న  ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _  చూడన్నా                                                  (2X)
1.            చరిత్రలోనికి వచ్చాడన్నా_ పవిత్ర జీవం తెచ్చాడన్నా                              (2X)
                అద్వితీయుడు ఆదిదేవుడు _ ఆదరించెను ఆదుకొనును                        (2X)
ఓరన్న  ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _  చూడన్నా                                                 (2X)
2.         పరమును విడచి వచ్చాడన్నా_ నరులలో నరుడై పుట్టాడన్నా               (2X)
                పరిశుద్దుడు పావనుడు _ ప్రేమించెను ప్రాణమిచ్చెను                              (2X)
ఓరన్న  ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _  చూడన్నా                                                 (2X)
3.         శిలువలో ప్రాణం పెట్టా డ న్నా _ మరణం గెలిచి లేచాడన్న                      (2X)
                మహిమ ప్రభూ మృత్యంజయుడు _ క్షమియించును జయమిచ్చును    (2X)
ఓరన్న  ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _  చూడన్నా                                                 (2X)

చిరకాల స్నేహితుడా
పల్లవి:    చిరకాల స్నేహితుడానా హృదయాన సన్నిహితుడా                           (2X)  
నా తోడు  నీవయ్యానీ స్నేహం  చాలయ్యా
నా నీడ  నీవయ్యా,  ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం,  ఇధి నా యేసు  స్నేహం                                              (2X)
1.        బంధువులు వెలివేసినవెలివేయని  స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య  స్నేహం,  నాయేసుని  స్నేహం
చిరకాల స్నేహం,  ఇధి నా యేసు  స్నేహం                                              (2X)
2.        కష్టాలలోకన్నీళ్లలో,  నను మోయు  నీ స్నేహం
నను ధైర్యపరచి  ఆదరణ కలిగించునాయేసుని  స్నేహం
చిరకాల స్నేహం,  ఇధి నా యేసు  స్నేహం                                              (2X)
3.        నిజమైనదివిడువనిధి,  ప్రేమించు నీ స్నేహం
కలువరిలొ చూపిన,  ఆ సిలువ స్నేహం,  నాయేసుని  స్నేహం
చిరకాల స్నేహం,  ఇధి నా యేసు  స్నేహం                                              (2X)
చిరకాల స్నేహితుడా

జీవనదిని నా హృదయములో ప్రవహింప

పల్లవి:     జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా       (2X)
1.        శరీరక్రియులన్నియు నాలో నశియించేయుమయు             (2X)
2.         బలహీన సమయుములో నీ బలము ప్రసాదించుము         (2X)
3.        ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయ            (2X)
4.        ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ           (2X)


యేసు రక్తము రక్తము  రక్తము
పల్లవి:    యేసు రక్తము రక్తము  రక్తము యేసు రక్తము రక్తము రక్తము 
అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము  
యేసు రక్తము రక్తము రక్తము 
యేసు రక్తము రక్తము రక్తము
1.        ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము          
          ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము
బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే  
బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే
యేసు రక్తము రక్తము రక్తము  యేసు రక్తము రక్తము రక్తము 
అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము  
యేసు రక్తము రక్తము రక్తము 
2.        మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము     
          మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను       
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను
యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము 
అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము  
యేసు రక్తము రక్తము రక్తము 
3.        మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము       
మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను 
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను  
యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము 
అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము  
యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము