1. యేసుతో ఠీవిగాను పోదమా
యేసుతో ఠీవిగాను పోదమా
అడ్డుగా వచ్చు వైరి గెల్వను
యుద్ధ నాదంబుతో పోదమా
1. రారాజు సై న్యమందు చేరను
ఆరాజు దివ్య సేవ చేయను
యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా
యేసుతో ఠీవిగాను వెడలను "యేసుతో"
2. విశ్వాస కవచమును ధరించుచు
ఆ రాజు నాజ్ణమధిని నిల్పుచు
అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై
యేసుతో ఠీవిగాను పోదము "యేసుతో"
3. శోధనలు మనల చుట్టి వచ్చినా
సాతాను అంబులెన్నో తగిలినా
భయము లేదు మనకిక ప్రభువు చెంత నుందుము
సాదనబెవరు నీవు నేనెగా "యేసుతో"
4. ఓయువతి యువకులార చేరుడీ
శ్రీ యేసు రాజు వార్త చాటుడీ
లోకమంత ఏకమై యేసు రాజు గొల్వను
సాదనంబెవరు నీవు నేనెగా
2. జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా
జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా
స్తుతి మహిమలు నీకే .....
నా ఆత్మలో అనుక్షణం
నా అతిశయము నీవే - నా ఆనందము నీవే
నా ఆరాధన నీవే..... - 2 " జ్యోతి"
1. నా పరలోకపు తండ్రీ - వ్యవసాయకుడా
నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా
2. నా పరలోకపు తండ్రీ - నా మంచి కుమ్మరి
నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా
3. నా తండ్రి కుమార,పరిశుద్ధాత్ముడా
త్రీయేక దేవా - ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద
3. పాడెద నేనొక నూతన గీతం
పాడెద నేనొక నూతన గీతం - పాడెద మనసారా
యేసయ్యా నీ నామమేగాగ వేరొక నామము లేదాయే -2
1. కలుషితమైన నదియై నేను - కడలియైన నీలో - 2
కలిసిపోతినే కలువరి ధారిలో కనబడదే ఇక పాపాలరాశి - 2
2. పోరు తరగని సిగ సెగలన్నియు - అణచి కృపాతిశయము -2
కొదువైన నానా హృదయములోన పొంగెనే అభిషేకతైలం - 2
4. హల్లేలూయ స్తుతి మహిమా ఎల్లఫుడు దేవుని కిచ్చెదము
హల్లేలూయ స్తుతి మహిమా ఎల్లఫుడు దేవుని కిచ్చెదము
ఆ... హల్లెలూయ, హల్లెలూయ. హల్లెలూయ -2 "హల్లేలూయ"
1. అల సై.న్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము - 2
అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము - 2 "హల్లే"
2. ఆకాశము నుండి మన్నాను పంపిన - ఆ దేవుని స్తుతించెదము - 2
బండనుండి మధుర జలమును పంపిన - ఆ యెహోవాను స్తుతించెదము - 2 "హల్లే"
3. పరలోకము నుండి ధరకేతించిన - దేవుని స్తుతించెదము - 2
నసియించు దానిని వెదకి రక్షించిన - యేసుని స్తుతించెదము - 2 "హల్లే"
5. శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం - భజియించి నే పాడనా స్వామీ - 2
హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా
1. దానియేలును సింహపు బోనులో - కాపాడినది నీవెకదా - 2
జలప్రళయములో నోవాహును గాచిన
బలవంతుడవు నీవెకదా - నీవెకదా
హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా "శృతి"
2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవెకదా - 2
పాపులకొరకై ప్రాణమునిచ్చిన
కరుణామయుడవు నీవెకదా - నీవెకదా
హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా "శృతి"
6. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు ?
నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు ?
నీలా క్షమియించెదెవరు ? యేసయ్యా
నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరూ? "2"
1. వెండి బంగారము ధన ధా న్యాలను - ఒక్కపోగేసిన నీతో సరితూగునా “2"
జీవనదులన్నియూ సర్వసముద్రములు - ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా
నీలా జాలిగల ప్రేమగల దేవుడేరి - నీవేగా మంచి దేవుడవు "2" " నీతో"
2. పలు వేధాలలోమత గ్రందాలలో - పావనేసుకన్న పరిశుద్ధుడెవరు “2"
పాప పరిహారము సిలువ మరణమొంది - తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు
నీలా పరిశుద్ద దేవుడెవరున్నారయ్యా - నీవేగా విమోచకుడవు "2" "నీతో"
3. నేను వెదకాకున్నా నాకు దొరికితివి - నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి "2"
నీకు గాయాలుచేసి తరచు రేపితిని - నన్నెంతో సహించి క్షమియించితివి
లోక సౌఖ్యాలన్నీ ఒక చోట - కుమ్మరించినా - నీవేగా చాలిన దేవుడవు "2" "నీతో”
7. జీవిత యాత్రలో నాదు గురి నీవె
జీవిత యాత్రలో నాదు గురి నీవెగా - నీకు సాటియెవ్వరు యేసువా
నీవు నడిచావు కెరటాలపై - నన్ను నడిపించుమో యేసువా "జీవిత"
1. నన్ను నడిపించు చుక్కాని నీవేకదా
నన్ను కాపాడు దుర్గంబు నీవేగదా
నీదు వాక్యంబు సత్యంబుగా - నాకు నిరతంబు జీవంబెగా
నేను పయనించు మార్గంబెగా - నన్ను నడిపించుమో యేసువా "జీవిత"
2. నాకు నిరతంబు మధిలోన నీద్యానమే
నేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే
నాకు నీవేగా సర్వస్వము - నీదు నామంబె ఆధారము
నాకు సర్వేశ్వరుడనీవెగా - నిన్ను స్తుతియింతుమో యేసువా "జీవిత"
No comments:
Post a Comment